Facebook Twitter
రంభ కాదది...రాక్షసి

గత సంవత్సరమంతా 

"గాయాలమయమే" 

కారణం కనిపించని ఆ కరోనా

కడుపులో 

కత్తులుంచుకుని కౌగిలించుకుంది 

 

గత సంవత్సరమంతా 

"కన్నీటిమయమే"

కారణం కరోనా 

కాలసర్పమైకాటువేసింది 

తలపెట్టిన ప్రతి కార్యాన్ని 

చేసిన ప్రతి పనిని 

వేసిన ప్రతి అడుగును 

నేలకేసి కొట్టింది

లక్షలసార్లు శిక్షలు వేసింది 

పట్టుకున్న ప్రతికర్రనూ 

పాముగా మార్చింది  

ముట్టిన ప్రతివస్తువును 

మట్టిగా మార్చింది

 

గతసంవత్సరమంతా 

"విషాదాలమయమే"

మన సుఖసంతోషాలను లాక్కొని

వెళ్ళిన ప్రతిదారిని రాళ్ళతోరప్పలతో 

ముళ్ళతుప్పలతో ముంచెత్తింది 

గుండెల్లో గునపాలు గుచ్చింది

జీవితాలలో విషాదాన్ని నింపింది 

 

ప్రతి నిమిషాన్ని ఒక 

నిప్పుకణికలా మార్చింది 

వెలుగన్నదిలేకుండా చేసింది 

చిమ్మ చీకటిని చిమ్మింది

మనశ్శాంతిని మసిచేసింది 

సమస్యలను సంధించింది 

బాధలతో బ్రతుకునుబంధించింది

గుర్తు కొచ్చినప్పుడల్లా గుండెలు 

బరువెక్కి వెక్కివెక్కి ఏడ్చిన

రోజులెన్నో రాత్రులు ఎన్నో ఎన్నెన్నో 

 

ఆ కతర్నాక్ కరోనా రంభ కాదు

అది రాచిరంపాన పెట్టిన రాక్షసి....