Facebook Twitter
ఈగట్టి మట్టి మనిషి...

ఈ గట్టి మట్టి మనిషి దారిలో 

ఎన్నో పురుగులు పుట్టాయి 

ఈ మనిషి పరుగు ఆపడానికి

కానీ,అవి ఆపలేకపోయాయి

అపజయం పాలయ్యాయి

 

ఎన్నో ముళ్ళు మొలిచాయి

ఈ మనిషి పాదాలు సోకగానే

అవి పరిమళించే మరుమల్లె 

పువ్వులుగా‌ మారిపోయాయి

 

ఎన్నో విషక్రిములు పుట్టాయి 

పాదాలను కుట్టాయి,చివరికి

ఈ మనిషి పాదాల క్రిందేపడి 

నలిగి నుజ్జు నుజ్జైపోయాయి 

 

ఎన్నో మంటలు చెలరేగాయి

ఆగని ఈ మనిషి నడక చూసి 

ఆ మంటలే చల్లారిపోయాయి

 

ఎన్నో గుంటలు మిట్టలేర్పడ్డాయి

కానీ,అవే ఈ మట్టిమనిషికి

పచ్చని పంటలనిచ్చాయి

 

ఎన్నో విషసర్పాలు బుసలు కొట్టాయి

చాటుమాటుగా కాటు వేసే ఆ సర్పాలే

నాగస్వరం ఊదగానే నాట్యమాడాయి

 

అవన్నీ అంతులేని క్షోభను 

అపారమైన ధన ప్రాణ నష్టాన్ని 

కలిగించాయే,కాని,ఈ మనిషిని 

మాత్రం అంతం చేయలేకపోయాయి

 

ఈ గట్టి మట్టి మనిషికి 

బెదిరించే ఎంతటి శక్తినైనా 

ఎదిరించడం తెలుసు దాని 

గుండెల్లో నిదురించడం తెలుసు

అఖండ విజయం సాధించడం తెలుసు