ఎంతకాలం ? ఎంతకాలం
ప్రశాంతంగా
బ్రతికే ప్రజల నెత్తిన
ఉరుములా ఉరిమి
మెరుపులా మెరిసి
అకస్మాత్తుగా
ఒక పిడుగల్లే
విరుచుకుపడిన
ఈ ఘోర విపత్తుకు
విశ్వమే విస్తుపోతోంది
విలవిలలాడి పోతోంది
ప్రజలకు కంటిమీద
కునుకే లేకుండా చేసింది
ఎంతకాలం ? ఎంతకాలం ?
ఇంకెంత కాలం ?
ఈ కరోనా విషజ్వరం
ఈ కరోనా మృత్యుభయం
ఈ కరోనా కల్లోలం
ఈ కరోనా కన్నీటి వరద
ఈ కరోనా కారు చిచ్చు
ఈ కరోనా కరాళ నృత్యం
ఈ కరోనా విధ్వంసం
ఈ కరోనా విజృంభణ
ఈ కరోనా విలయ తాండవం
ఎంతకాలం ? ఇంకెంత కాలం?
ఎంతో కాలం లేదు కొంత కాలమే
అలక్ష్యము చేయనంతకాలం
అప్రమత్తంగా వున్నంత కాలం
సెల్ఫ్ ఐషోలేషన్ లో వున్నంతకాలం
శుభ్రంగా చేతులు కడుక్కున్నంతకాలం
ముందు జాగ్రత్తలు తీసుకున్నంతకాలం
మాస్కులు ముఖాలకు ధరించినంతకాలం
మందికి ఆరడుగుల దూరం ఉన్నంతకాలం



