మూడు కోతులు... ఒక కరోనా
మిత్రులారా
నాడు కోతులు చెప్పిన
నీతులు మూడు
చెడు వినవద్దు
చెడు కనవద్దు
చెడు మాట్లాడవద్దు
నేడు కరోన లోతుగ
గోతులు త్రవ్వుతుంది
దాన్ని గుడ్డిగా నమ్మకండి
గుంటలో పడిపోకండి
కల్లబొల్లి కథలు చెబుతుంది
కళ్ళకు గంతలు కట్టి
క్షణాల్లో కాటికీడుస్తుంది
మిత్రులారా జరా జాగ్రత్త
రోడ్ల వెంట విచ్చలవిడిగా
తిరగకండి రోగం తెచ్చుకోకండి
నేడు కరోనా ముప్పును
తప్పించుకునే మార్గాలు మూడు
మందికి దూరంగా వుండండి
చేతులు శుభ్రంగా కడుక్కోండి
మాస్కును మూతికి కట్టుకోండి



