Facebook Twitter
కరుణ జాలిలేని కరోనా..

భయంగా వుంది

క్షణక్షణం భయంగా

దినదిన గండంగా

బ్రతుకు భారంగా వుంది

కరోనా కనిపించదు

మృత్యువు కనిపించదు

మరి ముందు కనిపించే 

ప్రతిమనిషి మృత్యువేనేమో

కరోనా సోకితే

ఒంటరితనమే

అంటరానితనమే,ఆపై

దిక్కులేని కుక్కచావే

ముక్కునుండి గొంతులోకి

గొంతు నుండి ఊపిరితిత్తుల్లోకి

దొంగలా చొరబడి ఆపై 

యుధ్దభేరి మ్రోగించి

అవయవాలన్నిటిపై

ముప్పేట దాడి చేసి

కండల వీరుళ్ళను 

కోట్లకు పడగలెత్తిన 

కోటీశ్వరులను సైతం

కబళించి వేస్తుంది

కరుణజాలిలేకుండా 

కరోనా కాటికీడుస్తుంది

వ్యక్తిగత శుభ్రత

సోషియల్ డిస్టెన్స్

ముఖానికి మాస్కులు

సెల్ఫ్ ఐసోలేషన్

లాక్ డౌన్ నిబంధనలే

మనకు రామబాణాలు

యుద్దానికి సిద్ధంకండి

కరోనాను కట్టడి చేద్దాం

కనిపిస్తే కాల్చివేద్దాం

కలిసి అందరం

కరోనాను ఖతం చేద్దాం