కరోనాకు ముందు
విందులు వినోదాలు
విహారయాత్రలు
విలాసాలు కులాసాలు
అంగరంగ వైభవంగా వివాహాలు
పండుగలకు పబ్బాలకు
బంధువుల రాకపోకలు
మిత్రులతో మందు పార్టీలు
ఎక్కడ చూసినా కటౌట్లతో
జనసమీకరణతో షేక్ హ్యాండ్ లతో
భారీగా హోరెత్తే మీటింగులు
సెట్టింగులు,సినిమా షూటింగులు
సినిమా హాల్స్ లో షాపింగ్ మాల్స్ లో
గుంపులు గుంపులుగా మనుషులు
పండుగలకు,దేవాలయాలు
కిటకిటలాడాయి,కిక్కిరిసిన జనంతో
చర్చీలలో మసీదులో ప్రార్థనలు
ఎక్కడ చూసినా భక్తులతో పోటెత్తాయి
విదేశాల్లో బీచీలలో, హోటళ్ళలో
ఎక్కడ చూసినా రద్దీరద్దీగా జనం
బార్లలో రెస్టారెంట్లలో పార్కుల్లో
బహిరంగ ప్రదేశాల్లో ముద్దుముచ్చట్లతో
ఇసుకేస్తేరాలనంతగా, ఊపిరాడనంతగా
జనసముద్రాలైన రోడ్లు రైళ్ళు విమానాశ్రయాలు
నేడు కరోనా మహమ్మారితో,
లాక్ డౌన్ తో
నిర్మానుష్యంగా వున్నాయి
నివ్వెరపోయి చూస్తున్నాయి
ఐతే ఈ కరోనా కాలంలో మంచే జరిగింది
మనిషి మనిషికి మధ్య దూరం పెరిగినా
కుటుంబ సభ్యుల మధ్య దూరం తరిగింది
మంచితనం, మానవత్వపు రంగు మారింది
ధనం విలువ,ప్రాణం ఖరీదు తెలిసి వచ్చింది



