కన్నతల్లి - పినతల్లి /family/27
ఇద్దరులే తల్లులే
కాని ఒకరు కన్నతల్లి మరొకరు పినతల్లి
పెంపకంలో ఇద్దరికి
పెద్దతేడా కళ్లకు కనపడకపోవచ్చు కానీ
ప్రేమను పంచడంలో
చిన్నతేడా ఓ చిత్రమైన తేడా కనపడుతుంది
అందుకు కారణం
రక్తసంబంధమే అది అర్ధమయ్యేది
చిన్ననాడు పాలు పట్టేప్పుడు
పెద్దయ్యాక బిడ్డ ఆకలిని తీర్చేటప్పుడు
చిన్ననాడు కన్నతల్లి తన ఎర్రని రక్తాన్ని
తెల్లని పాలగా మార్చి బిడ్డ ఆకలినితీరుస్తుంది
కాని పినతల్లి ఆకలేసి బిడ్ద ఎన్ని కేకలేసినా
పట్టించుకోకుండా పాలడబ్బాతో ఆకలినితీరుస్తుంది
పెద్దయ్యాక కన్నతల్లి ఎంతో ప్రేమతో
ఎంతో ఆప్యాయంగా కమ్మనితిండి
కడుపు నిండా పెట్టి ఆపై పనికి వెళ్ళమంటుంది
కాని పినతల్లి పనిచేసి
వచ్చిన తర్వాతే తిండి అంటుంది
అది కూడా కడుపునిండా కాదు
తిడుతూపెడుతుంది అది కూడా ప్రేమతో కాదు



