Facebook Twitter
నియమబద్దజీవితం నిత్యసుందరం......family/31

దయగల హృదయమే దైవ మందిరం
నియమబద్ధ జీవితమే నిత్యసుందరం నిజమే

అన్నింటికి మూలకారణం ధనమే కానీ
ఆ ధనార్జనకు మూలకారణం కాలమే

ప్రతిమనిషి తన జీవితకాలంలో
భగవంతుని నుండి కోరుకునేది నాలుగే
ఒకటి - ఆరోగ్యం రెండు - ఆనందం  
మూడు - ఆదాయం నాలుగు - ఆయుస్సు

కాలం కరిగేకొద్ది వయసు పెరుగుతుంది
వయసు పెరిగేకొద్ది ఆరోగ్యం తరుగుతుంది
ఆరోగ్యం తిరుగేకొద్ది ఆనందం తరుగుతుంది
ఆనందం తిరుగేకొద్ది ఆయుస్సు తరుగుతుంది

కాలం తరిగేకొద్ది ప్లాటు విలువ పెరుగుతుంది
ప్లాటు విలువ పెరిగేకొద్ది ఆదాయం పెరుగుతుంది
ఆదాయం పెరిగేకొద్ది అభివృద్ధి జరుగుతుంది

అభివృద్ధి జరిగేకొద్ది ఆరోగ్యం పెరుగుతుంది
ఆరోగ్యం పెరిగేకొద్ది ఆనందం పెరుగుతుంది
ఆరోగ్యం పెరిగేకొద్ది ఆయుస్సు పెరుగుతుంది

అన్న పోలన్న కలగన్న
కనుగొన్న ఈ నిజజీవిత సత్యం
విన్న,చదివిన,ఆచరించినందరి జీవితం
సుఖ సంతోషాల సుందర నందన వనం