మనం చేసిన మంచిచెడు పనులు .....family/37
కనిపించని ఈ కాలగమనంలో
నిముషాలు గంటలుగా గంటలు వారాలుగా
వారాలు నెలలుగా నెలలు సంవత్సరాలుగా
చకచకా మారిపోవచ్చు
ఓ పగలు రాత్రిలా
ఓ పౌర్ణమి అమావాస్యలా
ఓ సుర్యోదయం సూర్యాస్తమయంలా
గోడలమీది పాత క్యాలెండర్లు
కొత్త క్యాలెండర్లుగా మారిపోవచ్చు
కాని ఈ జీవితంలో మనం చేసిన
మంచిచెడు పనులు మాత్రం మారవు
అవి శిలాక్షరాళ్ళలా చెక్కుచెదరవు
ఒక చెడు పని కనపడని
ఒక కాలసర్పమై మనల్ని కాటు వేస్తూనే వుంటుంది
ఓ వేటకుక్కలా వేటాడుతూనే వుంటుంది
ఓ వేటకొడవలై మన మెడమీద
వ్రేలాడుతూనే వుంటుంది
ఒక తీరని శాపమై మనవెంట పడుతూనే వుంటుంది
కాని ఒక మంచి పని మాత్రం
ఒక కన్నతల్లి చల్లనిఒడిలా
ఓ కోడి రెక్కలా కంటికి రెప్పలా
కనపడని ఒక కవచంలా మనల్ని
అడుగడుగునా కాపాడుతూనే వుంటుంది



