పెళ్లికాక ముందు
ప్రతి ఆడపిల్ల
అందమైన భర్త రావాలని
కమ్మని కలలు కంటుంది
పెళ్లయిన తర్వాత
పండంటి బిడ్డ కలగాలని
కోటిదేవుళ్ళకు మొక్కుకుంటుంది
పిల్లలు పుట్టిన తర్వాత
వారు ప్రయోజకులు కావాలని
మంచి ఉద్యోగం రావాలని
మంచి కోడలు రావాలని
మంచి అల్లుడు రావాలని
వ్రతాలు పూజలు చేస్తుంది
వారికి బిడ్డలు పుట్టిన తర్వాత
అందరికి అడ్డమైన వెట్టిచాకిరి చేస్తుంది
తన బిడ్డలు తమ భార్యాబిడ్డలతో చల్లగా వుండాలని కోరుకుంటుందే తప్ప తనను బాగాచూసుకోవాలని కలలు కనదు తనకు కడుపు నిండా తిండి పెట్టాలని ఏనాడూ కోరుకోదు
కాని తాను నడవలేనప్పుడు
తనకు కళ్ళు కానరానప్పుడు
తన భర్త తనకు తోడుగా లేనప్పుడు
తాను మంచంలో పడినప్పుడు
మాత్రం
కొన్ని మందులు కొనిపెట్టమని కొడుకులను కోడళ్ళను మనవళ్లను ప్రాదేయపడుతుంది వారి
పాదాలు పట్టుకుంటుంది
ఆసుపత్రికి తీసుకెళ్లమని ఆశతో అర్థిస్తుంది
కన్నీటితో ప్రార్థిస్తుంది అంతే
కాని కాస్తంత కనికరంకూడా లేని ఈ కాలపు బిడ్డలు బ్రతికినంతకాలం తమ బాగునే కోరుకున్న కన్నవాళ్ళ చావునే సిగ్గు లజ్జలేకుండగా కోరుకుంటున్నారు
వారు ఆదాయం లేనివారని చులకనగా చూస్తున్నారు వారు అనారోగ్యానికి గురైతే అసహ్యించుకుంటున్నారు
కన్నవారని కూడా చూడకుండా కాలదన్నుతున్నారు కాటికీడుస్తున్నారు. కలికాలం. మానవత్వంలేని వారు అసలు మనుషులే కాదు వాటికన్నా పశువులు నయం. కాని రేపు వారికి కూడా ఇట్టి గతే పట్టదని గ్యారంటీ ఏమిటి?



