ప్రతిరోజు మనం తీరిక వేళల్లో…
కొంత సమయాన్ని
పుస్తకాలు చదివేందుకు కేటాయించాలి
అది విఙ్నానానికి వివేకానికి పునాది
కొంత సమయాన్ని
సత్సంకల్పానికి కేటాయించాలి
అది యుక్తికి శక్తికి మూలం
కొంత సమయాన్ని
శక్తిమేరా శ్రమించేందుకు కేటాయించాలి
అది విజయానికి వినోదానికి బాట
కొంత సమయాన్ని
కుటుంబ అవసరాలకు కేటాయించాలి
అది బాధ్యతలకు బందాలకు నిదర్శనం
కొంత సమయాన్ని
ప్రజా సేవకు కేటాయించాలి
అది మంచికి మానవత్వానికి ప్రతిరూపం
కొంత సమయాన్ని
పరమాత్మను ప్రార్ధించేందుకు కేటాయించాలి
అది ఆత్మశుద్దికి ఆత్మశ్శాంతికి
చక్కని ఔషధం



