నడక నీది పడక ఆ పరమాత్మది
దాటకు దాటకు లక్ష్మణరేఖ
ఈ జీవితానికి అర్ధం పరమార్ధం
గీసుకున్న గీతే వ్రాసుకున్న వ్రాతే
మాట తప్పకు సాకులు చెప్పకు ఊగిసలాడకు
ఉక్కిరిబిక్కిరికాకు దిక్కులు చూడకు దిగులు చెందకు
ఆరునూరైనా సరే
నెత్తిన పిడుగులు పడినా సరే
అడుగులు ముందుకే
ఆరోగ్యం అంచుల దాకా
అనారోగ్యం అంతుచూసే దాకా
రాత్రి అన్నీ రద్దు రద్దు
ఉదయం పూట కునుకు వద్దు
ముసుగు వద్దు పది దాకపడక వద్దు
నడకే నడక పరుగే పరుగు
తినే తిండితో
చేసే యోగ వ్యాయామాలతో
కండబలం గుండెబలం
ఆత్మబలం వుండాలి ఆత్మతృప్తి చెందాలి
పడిన ప్రతి శ్రమకు ప్రతిఫలం పొందాలి
జీవితంలో ఆనందం ఆరోగ్యం
ప్రశాంతత పొంగి పొర్లాలి
అవి పదిమందికి ప్రేమతో పంచాలి
మనజీవితం ఎందరికో ఆదర్శం కావాలి
ఈ బ్రతుకు ధన్యమై పోవాలి



