Facebook Twitter
ఆ మంచం వెనక ఏముందో కొంచం ఆలోచించండి ప్లీజ్…

మా కులం మా కులం
మా మతం మా మతం

మా ఉద్యోగం  మా ఉద్యోగం
మా హోదా మా హోదా

మా జీతం  మా జీతం
మా సుఖం మా సుఖం

మా పదవి  మా పదవి
మా అధికారం మా అధికారం

మా యిల్లు మా యిల్లు
మా వాళ్లు మా వాళ్లు

మా అందం మా అందం
మా ఆస్తి  మా ఆస్తి

మా కంచం మా కంచం
మా మంచం మా మంచం

అంటూ కలలోసైతం కలవరించకండి
కొంచం ఆత్మీయంగా ఆలోచించండి
ఒక పచ్చినిజాన్ని తెలుసుకోండి
ఇక ఆ మంచానికే మీరు దూరమైతే
అన్నింటికి దూరమైనట్లేనని
మాదిమాది అన్నదేది మీదికాదని
 
గాలిబుడగ జీవితమని
పగిలిపోక తప్పదని
పైనుండి పిలుపు రాగానే,
అన్ని వదిలి పరలోకానికి,
పారిపోక తప్పదని
తెలుసుకుంటే చాలు

మీ మనసుకు తృప్తి కలుగుతుంది
మీ ఆత్మకు శాంతి దొరుకుతుంది
మీ ఆయుష్షు పెరుగుతుంది
మీ జీవితం ధన్యమౌతుంది
మీ బ్రతుక్కు ఒక అర్ధం
ఒక పరమార్ధం వుంటుంది