Facebook Twitter
మీరు అదృష్టవంతులా ? అపరకుబేరులా?

శ్రమ పేరు వినగానే
సొమ్మసిల్లే సోమరిపోతులు
కష్టపడలేరు
కడుపు నింపుకోలేరు
ఖర్చులు అదుపు చెయ్యలేరు
డబ్బు విలువ తెలిసిన
ఒక్క శ్రమజీవులు తప్ప

ఖర్చులు అదుపుతప్పి
కంట్రోల్  లేకుండా 
కళ్లాలులేని గుర్రాల్లా
పరుగులు తీస్తుంటే

అప్పులు ఆంబోతుల్లా
తరుముకుంటూ వస్తాయి 
అదుపు చెయ్యకతే
ఒక కుదుపు కుదుపుతాయి
కుమ్మేస్తాయి

అందుకెే ఖర్చులు అదుపుచేసి
క్రమం తప్పకుండా పొదుపు చేస్తే
బ్రతుకు కాస్త కుదుట పడినట్లే
కుదుట పడితే చాలు మీరు కుబేరులైనట్లే

అంటే అనవసర ఖర్చుల
అదుపు ఒక పొదుపుగా
పొదుపు ఒక మదుపుగా
మదుపు ఒక కుదుపుగా
కుదుపు నుండి బయట పడితే 
ఆపై కూడబెట్టడమేగా

నేడు కూడబెట్టినోడేగా
రేపు కుబేరుడయ్యేది
నేటి సోమరిపోతులే
రేపటి బిక్షగాళ్ళు బికారులు
నేటి శ్రమజీవులే
రేపటి అదృష్టవంతులు అపరకుబేరులు