Facebook Twitter
కని,పెంచిన అమ్మానాన్నలు కనిపించే దేవతలు కాదా?

కమ్మని కలలెన్నోకని
కన్ననాటినుండి
కన్నబిడ్డలు కళ్ళు
తెరిచిన నాటినుండి
కంటికిరెప్పలా కాపాడిన

కాలిలో ముల్లుగుచ్చుకుంటే
కన్నీరు కార్చిన 
కడుపు మాడ్చుకొని
కన్నబిడ్డలకు కమ్మని తిండిపెట్టిన
చిన్నజబ్బు చేస్తే డాక్టర్
దగ్గరికి పరుగులు తీసిన

తలకుమించి అప్పులుచేసి
స్కూలు కాలేజి ఫీజులు కట్టిన
విద్యావంతులుగా విఙానవంతులుగా
ఉన్నతుద్యోగులుగా తీర్చిదిద్దిన

కాలి చెప్పులు అరిగేలా తిరిగి తిరిగి
ఖరీదైన విదేశీ సంబంధాలు వెదికివెదికి
అంగరంగ వైభవంగా ఎంతో
ఘనంగా వివాహాలు చేసిన

ఆస్తిపాస్తులు అందరికి పంచి
అస్థిపంజరాలుగా మారిన

అమ్మానాన్నలను
కనికరం లేక కసిరి కొట్టే
బాద్యతలేక బయటికి నెట్టే
కన్నబిడ్డలు ఎంతటి కఠినాత్ములు!
ఎంతటి నిర్దయులు !ఎంతటి నీచులు !
ఎంతటి క్రూరులు !ఎంతటి మూర్ఖులు!

ఇంతటి కృతఙతలేని
ఈ కుమారుల కన్నా
ఈ కుమార్తెల కన్నా
విశ్వాసమున్న ఆ
వీధికుక్కలే నయంగదా