ఇంటిపెద్దకే బరువు బాధ్యతలు
ఇంటిపెద్దకే కుటుంబ రక్షణ భారం
కారణం కన్నందుకు
కట్టుకున్నందుకు
ఉద్యోగం చేస్తున్నందుకు
ధనం సంపాదిస్తున్నందుకు
ఆస్తులు ఆర్జిస్తున్నందుకు
ఎప్పుడైనా ఏనాడైనా
పండిన చెట్టుకెే మెండుగ దెబ్బలు
ఒక్క ఐడియా మన జీవితాన్నే
మార్చివేస్తుంది దశ తిరిగేలాచేస్తుంది
ఎప్పుడైనా ఏదైనా ఒక
తప్పుడు ఆలోచన వస్తే
తక్షణమే దాన్ని అమలుచేసే మనిషికి తప్పవు
అవమానాలు అష్టకష్టాలు
ఆనాడు సీతను అపహరించాలన్న
చెడు ఆలోచన రాగానే దాన్ని వెంటనే
అమలు చేసినందుకే
లంకా దహనం జరిగింది
రావణరాజ్యం సర్వనాశనమైపోయింది
ఎప్పుడైనా ఏదైనా
ఒక మంచి ఆలోచన బుర్రకు తడితే
దాన్ని వారాల నెలల తరబడి వాయిదావెయ్యక
క్షణమే దాన్ని అమలుచేసిన ఆకస్మిక ధనలాభమే
అదే ఇంటిపెద్ద ఎప్పుడైనా ఇన్సూరెన్సు
చెయ్యాలనుకొని వెంటనే చేసేస్తే
ఆపై జరగరాని ఘోరమేదైనా జరిగితే
ఇంటివారికి లక్షలు కోట్లు రావొచ్చు
అంటే ఇన్సూరెన్సుతో ఇంటిపెద్ద
అస్తమించి కాడా ఆర్జిస్తున్నాడని
మరణించి కూడా పైనుండి
మనియార్డర్ పంపుతున్నాడని అర్థం



