Facebook Twitter
ఏ చూపూ చివరిదో ఎవరికి ఎరుక...

ఈ జీవితంలో ఏది చిట్టచివరిదో చెప్పలేము 
మొన్న కళ్లకు కనిపించిన వారు నిన్నలేరు
నిన్న కలిసి మాట్లాడిన వారు నేడులేరు
నేడు కలిసి తిన్నవారు తిరిగినవారు
రేపు మాయమైపోతున్నారు

అందుకే 
ఏ మాట చివరిదో
ఏ ఆట చివరిదో
ఏ నవ్వు చివరిదో
ఏ పలకరింపు చివరిదో
ఏ కలయిక చివరిదో
ఏ చూపూ చివరిదో ఎవరికి ఎరుక
ఇది ఎంతకూ అర్ధంకాని ఓ వింత విషయం

అందుకే
అందరిని మంచిగా పరాకరిస్తూ వుండు
అందరితో మంచిగా మాట్లాడుతూ వుండు
ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి వుండు
ఎవరికీ దూరం కాకు ఎవరితోనూ పగవద్దు

రేపు వెళ్లడమంటూ తప్పదు గనుక 
శత్రుశేషంలేకుండా ఉన్నంతకాలం అందరితో
మంచిగా వుండి మరణించడం మంచిది గదా
ఆ తర్వాత ఎవ్వరినీ కలవలేనంత దూరం వెళ్తాం 
ఎవరూ పిలిచినా పలికలేనంత దూరం వెళ్తాం

ఎవరినీ మళ్ళీ తిరిగి చూడలేనంత దూరం వెళ్తాం
అందరం మరలిరాని ఏలోకాలకో తరలిపోతాం గదా