అమ్మ గంటసేపు
స్టౌ ముందు
నిలబడి కష్టపడి
రకరకాల వంటలు చేస్తే
ఏవంటా బాగోలేదంటే
అమ్మ కంట కన్నీరే గదా
అదే అమ్మా నీ చేతి వంట
అమృతం అని అనకపోయినా
కమ్మగా చాలా రుచిగా ఉందమ్మా
కడుపు నిండిపోయిందమ్మా అని
ఒక్క మాట అంటే చాలు
ఏమీ తినకపోయినా
అమ్మ కడుపు నిండిపోతుంది
అమ్మ ముసిముసినవ్వులు
నవ్వుతుంది మురిసిపోతుంది
తెగ సంబరపడి పోతుంది
అలాగే పెళ్లి చూపులు
ఐపోయిన తర్వాత
అమ్మాయి నచ్చిందని
వియ్యాల వారినుండి
కమ్మని కబురు వస్తే చాలు
అమ్మాయి మనసు
ఉయ్యాల జంపాల లూగుతుంది
పరవశంతో పరవళ్ళు తొక్కుతుంది
కాని ఏ కబురు రాకపోతే
ఎదురు చుసి ఎదురు చూసి పాపం
ఏటివైపు పరుగులు పెడుతుంది
అలాగే సైట్ విజిట్ ఐపోయిన తర్వాత
కస్టమర్ ఒక మంచి ప్లాట్ బుక్ చేసుకుంటే
మార్కెటింగ్ మేనేజర్ ఫ్లాటై పోతాడు
కాని ఎన్నికాల్స్ చేసినా లిఫ్ట్ చెయ్యకపోతే
ఏ డిసెషన్ తీసుకోకపోతే వాయిదాలు వేస్తూపోతే
మార్కెటింగ్ మేనేజర్ మైండ్ బ్లాకైపోతుంది



