తినాలనుకున్న స్వీటు వెంటనే తినండి
కొనాలనుకున్న ప్లాటు వెంటనే కొనండి
నామాట వినండి
అనుభవంతో చెబుతున్నాను
దయచేసి అతిగా ఆలస్యం చేయకండి
ఆలోచనలు పరిపరి విధాలపోతాయి
ఎప్పుడైనా అవసరమైతే ఎవరినుండైనా
సలహాలు సూచనలు స్వీకరించండి కాని
నిర్ణయాలు మాత్రం తప్పక మీరే తీసుకోండి
ఎందుకంటే
కొందరు వారు కొనరు మరొకర్ని కొననివ్వరు
వారు తినరు మరొకర్ని తిననివ్వరు
అందుకే బయటి వారి సలహాలు సూచనలు
మనకు మంచి కంటే చెడునే ఎక్కువ చేస్తాయి
రోజులు జరిగే కొద్ది బలమైన
ఆలోచనలు సైతం బలహీనమైపోతాయి
ఒక్కోసారి వారి ఉచిత సలహాలు
ఉక్కిరిబిక్కిరి చేస్తాయి ఊపిరాడనివ్వవు
సందేహాలౌతాయి కందిరీగల్లా కుడతాయి
భూతాలౌతాయి భయపెడతాయి
చాలావరకు మనల్ని బాధ పెడతాయి
మన మంచి ఆలోచనల్ని సైతం బంధిస్తాయి
సమస్యలౌతాయి కాళ్ళకు సంకెళ్లవుతాయి
ముళ్ళబాటలౌతాయి మనల్ని ముందుకెళ్ళనివ్వవు
అప్పుడు మనం సహజంగానే
అతిగా ఆలోచిస్తాము ఆలస్యం చేస్తాము
చూద్దాంలే ఇపుడే తొందరేముంది అనుకుంటాం
ఈ మధ్య కాలంలోసైట్ల విషయంలో కాని
ఫ్లాట్ల విషయంలో కానిరేట్ల విషయంలో కాని
ఏమాత్రం అవగాహనలేని
అమాయకులు ఏదో ఒకటి చెప్పగానే
మన మనసులు మారిపోతాయి
మన ఆశల దీపాలు ఆరిపోతాయి
అందుకే అతిగా ఆలస్యం చేయకండి
కుటుంబ సభ్యులందరు కూర్చొని
సమిష్టిగా తీసుకొనే నిర్ణయాలే సత్ఫలితాలనిస్తాయి
సందేహాం లేదు లేనేలేదు
ఇది ముమ్మాటికీ నిజం



