Facebook Twitter
ఆవేశం వద్దు - ఆలోచనే ముద్దు

క్షణికావేశంతో

మొండితనంతో

ఆత్మహత్యలకు సిద్దపడే 

ఓ అవివేకులారా ! ఓ ఆవేశపరులారా

ఓ అమాయకులారా ! ఓ నవయువకులారా !

 

ఈ జీవితమే ఒక యుద్ధరంగం

శత్రువులతో పోరాడాలి 

పోరాడి గెలవాలి

వెర్రివారిలా వెనుతిరగరాదు

పిరికి పందల్లా పారిపోరాదు

చిట్టచివరి రక్తపు బొట్టువరకు 

చివరి శ్వాస వరకు పోరాడాలి

 

బద్దవిరోధులకు బుద్ది చెప్పాలి

గుడ్డిగా విమర్శించేవారికి 

గుర్తుండేలా గుణపాఠం నేర్పాలి

అప్పుడే మీ చావుకు ఒక అర్థం

అప్పుడే మీ జన్మకు ఒక సార్థకత

 

పరీక్షలో ఫెయిలైనందుకో

ప్రేమ విఫలమైనందుకో

వ్యాపారంలోనో 

వ్యయసాయంలోనో

భారీగా నష్టం వచ్చినందుకో

నిరుద్యోగంతో నిర్వేదంతో

ఏ పురుగుమందు త్రాగో

ఏ ఫ్యానుకు ఉరివేసుకొనో 

ఏ ఎత్తైన బిల్డింగ్ పైకెక్కిదూకో

చనిపోయి సాధించే దేముంది?

కట్టై స్మశానంలో కాలడం తప్ప

 

ఆవేశపడి సాధించేది ఏముంది?

కన్నతల్లిదండ్రులకు గుండెకోత తప్ప

చావు సమస్యలకు పరిష్కారమా? కాదే

సమస్యలు ఎదురైతే వీరుల్లా పోరాడాలి

వద్దు వద్దు ఆత్మహత్యలకు పాల్పడవద్దు

వొద్దు వొద్దు క్షణికావేశానికి గురికావద్దు,వొద్దు

వొద్దు మీ బంగారు భవిష్యత్తును బలిచేసుకోవద్దు