Facebook Twitter
అవకాశాలే... నాకు...అవార్డులు..

ఆ సహృదయులు ఆ సంస్కారవంతులు

బంగారు అవకాశాలెన్నో కల్పించినందుకు

అందరూ అది ఒక అదృష్టంగా భావిస్తారు నేను

మాత్రం ఆ అవకాశాలను అదృష్టంగా భావించను 

కాని వాటిని "అవార్డులుగా" భావిస్తాను

 

ఆ మహాత్ములు ఆ పుణ్యాత్ములు మన కళ్ళకే

కనిపిస్తే వారికి అందరూ షేక్ హ్యాండ్ ఇస్తారు, కాని

నేను మాత్రం ఇవ్వను‌ ఆలింగనం చేసుకుంటాను

చిరునవ్వు నవ్వను కాని శిరసువంచి నమస్కరిస్తాను

 

నా మిత్రులెవరైనా నాకు నమస్కారం చేసినా

నేను ప్రతి‌నమస్కారం చేయను అందుకు వారు

నాకు సంస్కారం లేనివాడని నన్ను నిందించినా

నేను భరిస్తాను కాని తిరిగి నమస్కారము చేయను

 

కాని మనసులో వెంటనే ఆ భగవంతున్ని వేడుకొని

చిరుప్రార్థన చేస్తానిలా.....నా మనసులో మౌనంగా...

నాకు నమస్కారం పెట్టిన ఈ సంస్కారులను వారిని

వారి కుటుంబాన్ని వందేళ్లు వర్థిల్లేలా ఆశీర్వదించమని

 

కలలోసైతం ఊహించని ఎన్నోమంచి అవకాశాలను

కల్పించి‌, మనకంటూ ఒక చక్కని గుర్తింపునిచ్చిన

ఆ మహానుభావుల్ని కలిస్తే అందరూ ఆలింగనం

చేసుకుంటారు కాని, నేను మాత్రం ఆలింగనం చేసుకోను

కాని, వొంగి వారికి పాదాభివందనం చేస్తాను,అవసరమైతే

అనుమతిస్తే వారికి సాష్టాంగనమస్కారం‌ చేస్తాను.....