వేదాల సారమెరిగిన
విదేశాల్లో మారుమ్రోగిన
విశ్వవాణి ! విజ్ఞానగని
ఆధ్యాత్మిక గురువు !
ఉర్రూతలూగించే ప్రసంగాలతో
శక్తివంతమైన సందేశాలతో
యువత తలరాతలను
మార్చిన విధాత !
భరతమాత ముద్దుబిడ్డ !
శ్రీ రామకృష్ణ పరమహంస
ప్రియశిష్యుడు !
కాళీమాత భక్తుడు !
చికాగోలో సర్వమత సభలో
మేధావుల మెప్పునుపొందిన
ఉపన్యాసకేసరి ! స్వామి వివేకానందుడు!
బలమే జీవమని
బలహీనతే మరణమనీ
పడిలేచే కెరటమే మనకు ఆదర్శమని
ఇప్పుడు మనకు ఇనుప కండరాలు
ఉక్కునరాలున్న యువత కావాలని
అందుకే ఓ యువకిషోరులారా !
లెండి! నిద్రమేల్కొనండి!
గమ్యంచేరే వరకు
మీ పరుగును ఆపకండని
మీరు పులులు సింహాలే కాదు
మీరు అనంత శక్తిసంపన్నులని
యువతను మేల్కొల్పిన
స్పూర్తి ప్రధాత! స్వామి వివేకానందుడు!
నవభారత చైతన్యదీప్తియైన !
ఆధునిక యువతకు ఆశాదీపమైన !
భువిలో వెలసిన ఆధ్యాత్మిక దైవమైన !
మన స్వామి వివేకానందుని
సంపూర్ణ జీవితాన్ని వారి సజీవసందేశాలను
ప్రతినిత్యం స్మరించుకుందాం !
వారి అడుగుజాడల్లో నడుద్ధాం !
మన వ్యక్తిత్వదీపాలను వెలిగించుకుందాం !
నిర్మలమైన జీవితసౌధాలను నిర్మించుకుందాం !



