మొన్న...
కష్టాలకడలిలో...
కటికదారిద్ర్యంలో...
దిక్కుతోచని స్థితిలో...
ఎండిపోయిన రొట్టెముక్కలను
నీళ్ళలో నానబెట్టుకొని తిని ఆకలితీర్చుకున్నా...
అమెరికాలో ఎముకలు కొరికే చలిలో
పాత బట్టలతో రహస్యంగా రాతృళ్ళు గడిపినా...
తన విచిత్రవేషధారణచూసి వీదేశీవనితలు
పగటివేషగాడని పగలబడి నవ్వినా...
అపారమైన ధనరాశులొకవైపు
కాషాయవస్ర్తాలు దండకమండలాలొక వైపు
కలలో దర్శనమిస్తున్నా...
కాషాయవస్ర్తాలను కాళికాదేవి పదసన్నిధినే
కోరుకున్న "ఘనుడు త్యాగధనుడు" వివేకానందుడు
నిన్న...
చికాగోలో జరిగిన
సర్వమత సమ్మేళనసభలో
లేడీస్ అండ్ జెంటిల్ మెన్
అన్నది పాశ్చాత్యుల సంభోదన
మైడియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్
అన్నది స్వామి వివేకానందుని
ఆత్మీయ సంభోధన మతపెద్ధలందరికి
ఆ తీయని పిలుపు మతిపోయేలా చేసింది
విశ్వవేదికను ఒక కుదుపు కుదుపేసింది
మంత్రముగ్దులైన ఆ మతపెద్దల
చప్పట్లతో హాలంతా మర్మోగిపోయింది
ఒక భారతీయ ఆధ్యాత్మిక గురువు
విదేశీ గడ్డమీద సంధించిన
ఆ ఆత్మీయతా ప్రేమబాణాలు విదేశీయుల
హృదయాలను సూటిగా తాకాయి
ఆ "వినూత్న ప్రయోగమే ఆ విశిష్టప్రసంగమే"
ఆ సర్వమత సమ్మేళనంలో...
ఒక సంచలనాన్ని...
ఒక ప్రభంజనాన్ని...
ఒక సునామీని... సృష్టించింది
భారతీయుల సంస్కృతీ
సాంప్రదాయాలకు గొప్ప గుర్తింపును తెచ్చింది
స్వామి వివేకానంద ఉపన్యాసకేసరిగా
మేధావుల మెప్పును పొందాడు
ఖండాంతర ఖ్యాతినార్జించాడు
విశ్వానికే "ఆథ్యాత్మిక గురువుగా" అవతరించాడు
నేడు...
నవభారత చైతన్యదీప్తియైన !
ఆధునిక యువతకు ఆశాదీపమైన !
భువిలో వెలసిన దైవమైన !
శ్రీ స్వామి వివేకానందున్ని !
వారి సంపూర్ణ జీవితాన్ని సత్యసందేశాలను
నిత్యం స్మరించుకుందాం !
వారి అడుగుల్లో అడుగులు వేద్ధాం !
మన వ్యక్తిత్వదీపాలను వెలిగించుకుందాం !
నిర్మలమైన నిశ్ఛలమైన
సుందరమైన సుఖప్రదమైన
మహోన్నతమైన మంగళకరమైన
పరిపూర్ణమైన జీవితసౌధాలను నిర్మించుకుందాం !



