Facebook Twitter
అంబేద్కర్ చూపుడు వేలికి అర్థమేమిటి..?

వీధిలో విగ్రహమై నిలిచిన
అంబేద్కర్ చూపుడు వేలిచ్చే
శుభసందేశం ఒక్కటే...
చీకటి నుండి వెలుగువైపుకు
పయణించాలని...
కష్టించి పనిచేయాలని...
అభివృద్ధిని ఆకాంక్షించాలని...

ఆత్మగౌరవంతో బ్రతకాలని...
చైతన్యంతోనే జీవించాలని...
బానిసత్వానికి బలికారాదని... 
అణచివేతకు...అంటరానితనానికి...
కులనిర్మూలనకు వ్యతిరేకంగా...

మనువాదులతో కులపిశాచులతో
భీకర పోరాటం సాగించాలని...
బహుజనులకదే ఊపిరి కావాలని...

రాజ్యాధికారం కోసం
ఆరాటపడుతూ ఆశతో బ్రతకాలని...
జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని...
దైర్యసాహసాలతో ముందుకు సాగాలని...

ఆవేశం కన్నా ఆలోచన మిన్నని...
అజ్ఞానం కన్నా విజ్ఞానం మిన్నని...
ఆ చూపుడు వేలుకు అంతరార్థమని.....
తెలుసుకోండి..! బహుజనులారా..!
తెలుసుకోండి! నిండునిజాలు తెలుసుకోండి!