Facebook Twitter
కుబేరుడి కుడిభుజం

సాంకేతిక పరిజ్ఞానానికి
పటిష్టమైన నాయకత్వానికి
తెలివితేటలకు శక్తిసామర్థ్యాలకు
ప్రపంచంలో ఎవరికీ తీసిపోని
తెలుగుజాతి గర్వించే తెలుగుబిడ్డ
ప్రతిభాశాలి, స్నేహశీలి, బిజినెస్ మాగ్నెట్
మైక్రోసాఫ్ట్ దిగ్గజం సీఈవో శ్రీ సత్యనాదెళ్ళ

ఆయన ఆస్తి లెక్కపెట్టలేనంత
ఆయన జీతం కళ్ళుతిరిగేంత
ఆయన కీర్తి  ఆకాశమంత
ఆయన హృదయం సముద్రమంత
ఆయన పేరు మారు మ్రోగిపోతోంది
ప్రపంచమంతా,ఆయనే ప్రపంచ కుబేరుడైన
బిల్ గేట్స్ కుడిభుజం శ్రీ సత్యనాదెళ్ళ

శ్రీ సత్యనాదెళ్ళ అంటే
నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం
సత్సంబంధాలకు చెరిగిపోని ఒక సంతకం
శ్రీ సత్యనాదెళ్ళ అంటే ఆత్మవిశ్వాసం
మెండుగా వున్న ఆలోచనాపరుడు
సహాయకారి, గొప్ప సాంకేతిక నిపుణుడు

ఈ ఆదర్శమూర్తి సందేశమొక్కటే
పాతవాటిని పాతరేసి కొత్తవి నిర్మించమని
మానవ మనుగడని ప్రపంచగతిని మార్చే
విశిష్టమైన వినూత్నమైన ఆవిష్కరణలకై
నిబద్దతతో నిరంతరం అణ్వేషించమని,నిత్యం
విద్యార్థులై కొత్తదారుల్లో ప్రయాణించమని.