Facebook Twitter
తెలుగు తెర దేవత - శ్రీదేవి

శ్రీ దేవి నవ్వు
సిరిమల్లె పువ్వు
ఆమె ఓ నవవధువు
ఆమె కొంటె చూపుతో
మదిలో కోటీకోరికలు రేపు
ఆమె నడక కలహంస నడక
ఆమె ముఖం ముద్దమందారం
వెండితెర నేలిన జగదేక సుందరి
చీరకడితే అచ్చతెనుగు ఆడపడుచే
నటనంటే ప్రాణం నటనకే ఆమె అంకితం
సెట్ పైకొస్తే పాత్రలో నటించదు జీవిస్తుంది
ఈ చిత్రసీమలో మకుటంలేని ఓ మహారాణి
ఏ మచ్చలేనిది ఆమె నటనా జీవితం
ఎన్ని మాయని గాయాలైనా
ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా
ఎన్ని ఆటుపోటులు వచ్చినా
ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా
ఎవరినీ నిందించక విభేదించక
సర్దుకొని పోయిన సహనశీలి
ఆమె అనేక చిత్రాలలో అద్భుత
నటనను ప్రదర్శించి ఉత్తమనటిగా
ప్రశంసలు పొంది వార్డులెన్నో
అందుకున్న అభినవ నటవిదుషీమణి
ఆమె బాపుగీసిన బంగారు బొమ్మ
నవరసాలు పండించే నాట్యమయూరి
ఎప్పుడూ ముసిముసి నవ్వులు రువ్వుతూ
జిల్ జిల్ మంటూ జిగేలు రాణిలా
తెరపై కనిపించి తన అందచందాలతో
అత్యుత్తమ నటనతో ప్రేక్షకులకు విందు చేస్తుంది
కనువిందు చేస్తుంది మనసులను దోచుకుంటుంది
కలలో కనిపించి,కవ్వించి నవ్వించే ఊహల ఊర్వశిలా
ఆమె వృధ్ధనటులతో ముద్దుముద్దుగా నటించి

మురిపించింది ప్రేక్షక లోకాన్ని మైమరపించింది
ఆమె ఎవరో కాదు పదహారేళ్ళ వయసులో
ఆరేసుకోబోయి,చీరపారేసుకున్న తెలుగుతెర దేవత