Facebook Twitter
శుభాలనొసగే సూర్యోదయం…

అందమైన ఆనందకరమైన
మధురమైన మంగళకరమైన
సుందరమైన శుభకరమైన
సుప్రభాతవేళ తూర్పున
ఉదయించే ఆ సూర్యబింబాన్ని

తిలకించిన ప్రతివారు
పులకించి పోయెదురు
హృదయాలు ఉప్పొంగును
మనసులు పరవశించును
ఒళ్ళు పులకరించును
కళ్ళురెండు కలవరించును

కలువలు విరబూయును
పక్షులు కుహూ కుహూయని
కూనిరాగాలు తీయును
పచ్చని చెట్లు తలలూపుతూ
సంతోషంతో చప్పట్లు కొట్టును

కొండలు కోనలు
తనివితీరా మనసారా
స్వాగతం సుస్వాగతమంటూ
ఆనందగీతాలు ఆలపించును
నెమళ్ళు పురివిప్పి నాట్యమాడును

రైతులు...
ఆడుతూ పాడుతూ సేద్యం చేయుదురు
హలమును పుట్టి పొలమును దున్నెదరు
పిల్లలు బిల బిలమంటూ బడికి వెళ్ళెదరు
ఉద్యోగులు ఆఫీసులకు పరుగులు పెట్టెదరు

ఒక్కటి
మాత్రం పచ్చినిజం
సూర్యునికన్న ముందు
లేచినవారు సుఖపడతారు
వారిజీవితం సుఖమయమే సువర్ణశోభితమే