ఆదర్శదంపతులు ఆ ఇద్దరే...
ఏ అందమైన జంటైతే
అందరికీ కనులపంటో
ఏ అన్యోన్యత జంటైతే
యువజంటలకు ఆదర్శమో
అట్టి చక్కని ఆ జంట
నిండు నూరేళ్ళు వర్థిల్లాలని
గుండెగుడిలో మ్రోగిస్తూ జేగంట
కోరుకుంటారు అభిమానులంతా
సోఫాలో కూర్చున్నా
ప్రక్క ప్రక్కనే నిలుచున్నా
భుజాలమీద చేతులువేసుకుని
చిరునవ్వులు చిందించే ఆ జంట
అందించే సుఖజీవన సూత్రమొక్కటే
కలిసి మెలిసి ఉంటేనే కలదు సుఖమని
వేరు వేరుగా వుంటే వెతలకు గురౌతారని
అభిరుచులు వేరైనా ఇద్దరొక్కటై వుండాలని
ఆకారాలు వేరైనా ఆత్మ ఒక్కటిగా వుండాలని
భిన్నత్వంలో ఏకత్వమే భగవంతుని వరమని



