అది అసాధ్యమా ? కాదే
పూరిగుడిసెలో
పుట్టవచ్చు
ఒక పున్నమి చంద్రుడు
చీకటి గుహలో
పుట్టవచ్చు
ఒక చిరుతపులి
ఊరికి దూరానఉన్నా
శూద్రుల ఇంట
ఉదయించవచ్చు
ఒక ఎర్రని సూర్యుడు
దళిత దంపతుల
కడుపున పుట్టవచ్చు
ఒక దానకర్ణుడు
అది అసాధ్యమా ? కాదే
అది ఎనిమిదో వింతా ? కాదే
ఏదైనా సాధ్యమే ఆ సృష్టికర్తకు
జన్మనిచ్చేందుకు జాతకాలుమార్చేందుకు



