వారురేపు పెద్దవారైతే???
నేడు చిన్నపామునైనా
పెద్దకర్రతో కొట్టక పాపమని వదిలేయడం తప్పు
రేపు ఆ పామే పెద్దదై చాటుమాటుగా
కాటేస్తుంది ఎందరి ప్రాణాలకో తెస్తుంది ముప్పు
ఔను అది మొక్కనైనా మొగ్గనైనా
ఆదిలోనే త్రుంచాలని పెద్దవైతే
దాన్ని వంచలేము త్రుంచలేము
కాండాన్నైతే కొంచెమైనా కదిలించలేము
పిల్లలనైనా చిన్ననాడే తిట్టి కొట్టి
భయపెట్టి బెదిరించి బుజ్జగించి
బుద్దిచెప్పి సరైనదారిలో పెట్టాలి
వారే పెద్దవారైతే ఎవరి మాటవినరు
ఎవరినీ లెక్కచేయరు ఎవరికీ భయపడరు
మేమింతే మా ఇష్టమంటారు మొండికేస్తారు
తాము చెప్పిందే వేదమంటారు
తాము చేసిందే శాసనమంటారు
తాము పట్టిన కుందేటికి మూడేకాళ్ళంటారు
తొండముదిరి ఊసరవెల్లి కారాదు
అందుకే ఓ తల్లిదండ్రులారా...తస్మాత్ జాగ్రత్త



