గంట కాదు ఒక నిమిషం చాలు
మన జాతకాలు తారుమారు కావడానికి....
ఒక గంట వాట్సాప్ వాడకపోతే చూడకపోతే
పోయేదేముంది చెప్పండి
ఒక గంట మీ కళ్ళకు స్ట్రైన్ తగ్గడం
కాసింత విశ్రాంతి పొందడం తప్ప
ఒక గంట మీ సొంత పనులకు
ఒక చక్కని సమయం దొరకడం తప్ప
ఒక గంట మీరు మరో మంచి కార్యక్రమాలకు
శ్రీకారంచుట్టే బంగారు అవకాశం దొరకడం తప్ప
ఒక గంట మీ ఇష్టదైవానికి కేటాయించడం ఆ
దైవధ్యానంలో తరించండం తన్మయంచెందడం తప్ప
ఒక గంట ఏ వ్యాయామమో ఏయోగానో చేసే
మందులకు దూరంగా మనుగడ సాగించడం తప్ప
ఒక గంట ఏ బైబిలునో ఏ భగవద్గీతనో
ఏ ఆథ్యాత్మిక గ్రంథాన్నో ఇంకేదైనా మీకిష్టమైన
ఒక మంచి పుస్తకాన్ని పఠించే ఒక మంచి
అవకాశం లభించడం తప్ప
ఒక గంట ఇంటిలో వారితో కలిసి కాసేపు
మనసు విప్పి నాలుగు మంచిమాటలు
ముఖాముఖిగా మాట్లాడుకోవడం
సరదాగా కలిసి భోజనము చేయడం తప్ప
ఒక గంట మనకు ఇష్టమైన మిత్రులతో
ఫోన్ లో మనసు విప్పి మాట్లాడుకోవడం
భావాలను పంచుకోవడం
విలువైన విషయాలను చర్చించుకోవడం తప్ప
ఒక గంట అలా బయటికి వెళ్లి ఏవైనా
ఇష్టమైన వస్తువులను కొనుక్కోడం
ఏదైనా హోటల్ కి వెళ్లి ఇష్టమైనవి తినడం
ఏదైనా మంచిసినిమా కెళ్ళి కాస్తరిలాక్స్ కావడం తప్ప
అతిగా 24/7 వాడడం వల్ల
అతిగా వాట్సాప్ చూడడం వల్ల
ముఖ్యమైన విషయాలు మూలనపడవచ్చు
కంటిచూపు మందగించవచ్చు మంటగలసి పోవచ్చు
మొండి జబ్బులు దండిగా మీ వెంటపడవచ్చు
అంటే మీరు అనారోగ్యానికి అతిచేరువలో వున్నట్లే
పెనుముప్పు మీముందర పొంచి వున్నట్లే
దీనంతటికి అసలు కారణం
మన గుంటను మనమే తవ్వుకోవడం
మన కంటిని మనమే పొడుచుకోవడం
మన మీద మనకు నియంత్రణ లేకపోవడం
మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం
ఇదంతా స్వఅపరాధమేనని
తెలిసిఆ తరువాత కుమిలిపోవడం
అప్పటికే జరగరాని నష్టం జరిగిపోవడం
తిరిగి జీవితంలో కోలుకోలేని గట్టిదెబ్బలు తగలడం
సరిదిద్దుకునే అవకాశమే లేకపోవడం జరుగుతుంది



