ఏమాయె ఆ తొలిప్రేమ ?
ఎందుకు ?
చిన్నచిన్న విషయాలకే
చిందులువేస్తారు ?
ఎందుకు ?
చిన్నదానికే పగ,ప్రతీకారం
పెంచుకుంటారు ?
ఎందుకు ?
కసిని కల్మషాన్ని కడుపులో
వుంచుకుంటారు ?
ఎందుకు ?
నూరేళ్ళ మూడుముళ్ల బందాన్ని
ముందే తెంచుకుంటారు ?
ఎందుకు ?
పచ్చని కాపురంలో మీకు
మీరే చిచ్చుపెట్టుకుంటారు ?
ఎందుకు ?
సంతోషంగా సాఫీగా సాగిపోయే
జీవితనావని నడిసంద్రంలో
ఇద్దరు ఏకమై
మూర్ఖంగా ముంచేసుకుంటారు ?
కారణం ఒక్కటే !
నాడు పగలురాత్రి పంచుకున్న
ఆ స్వచ్చమైన ప్రేమల్ని,ఆ ఊసుల్ని
వాటి విలువల్ని ఆ తీపిజ్ఞాపకాలను
గుర్తుంచుకోక పోవడం వల్లనే !
గ్రుడ్డివారై పోవడంవల్లనే !
ఒక్కసారైనా, ప్రక్కవారిని చూసైనా
గుణపాఠాలు నేర్చుకోక పోవడంవల్లనే !



