Facebook Twitter
ఆ నలుగురు.....

అనుమానంతో భార్యను ఘోరంగా
కౄరంగా హింసించి ఆనందించే శాడిస్టు

జీహాదీ అంటూ కన్నవారిని సైతం
కడతేర్చే కరుడుగట్టిన తీవ్రవాది

పగలురాత్రి ఆనందంగా హాయిగా
బురదగుంటలో పొర్లాడే వరాహం

కళ్ళకు నాలుగుకాళ్ళు కనిపిస్తున్నా
తాను పట్టిన కుందేలుకు
మూడేకాళ్ళని వాదించే మూర్ఖుడు
ఈ నలుగురి మనస్తత్వం ఒక్కటే

కొండల్ని పిండిచేయవచ్చు
పర్వతాలను కూల్చవచ్చు

చుక్కల్ని నేల రాల్చవచ్చు
సూర్యచంద్రుల దిశను మార్చవచ్చు

సముద్రాన్ని రెండుపాయలుగా చీల్చవచ్చు కానీ
ఈ నలుగురిని మార్చడం ఆదేవుడితరం కూడాకాదేమో