పిచ్చివాళ్ళు - పిసనారులు
ఓట్లేసిన అమాయకపు ప్రజల
నోట్లోమట్టి కొట్టి కోట్లార్జించిలాభమేమి ?
కోట్లమంది అభిమాలున్ననేమి ?
ఎందరో నేతల జాతకాలే మారిపోలేదా
ప్రక్కనెవ్వరూలేక ఒక్కరే కాటికెళ్ళలేదా
నమ్మినవాళ్లను నట్టేటముంచి
అన్నమాట మీద నిలబడక
పచ్చిఅబద్దాలు ఆడుతూ
దొంగతనంగా దోచుకొనేవారికి
అత్యాశతో స్విస్ బ్యాంకుల్లో
దాచుకునే వారికెవరికైనా చివరికి
ఈ దుస్థితే రాసిపెట్టి వుండొచ్చు
అందుకే ఎవ్వరినీ ఎవ్వరూ
ఎక్కువకాలం మోసంచేయలేరు
నీతి న్యాయం ధర్మం తప్పినవాళ్ళు
మాయమాటలు చెప్పేవాళ్లు
అరచేతిలో స్వర్గం చూపేవాళ్లు
నమ్మక ద్రోహులు ఆశబోతులు
పిల్లికి బిక్షం పెట్టని పిసనారులు
పచ్చి మోసగాళ్ళు పిచ్చివాళ్ళ కిందే లెక్క
వాళ్ళు బ్రతికివున్నా చచ్చినోళ్ళకిందే లెక్క



