మళ్లీ చేపల వేటకు వెళ్ళాలా?
కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని
ఏ కస్టమర్ ను బ్రతిమిలాడరాదు
బ్రతిమిలాడి లాభం లేదు కూడా
అంతగా దిగజారి పోరాదు కూడా
దాహం వేసిన గుర్రం నీళ్ళు త్రాగినట్లు
అవసరం వున్నవాడు అప్పుచేస్తాడు
ఆకలి వేసినవాడు అన్నం తింటాడు
ఇంట్రెస్ట్ వున్నవాడు ఇన్వెస్ట్ చేస్తాడు
కాని వేడివేడిగా వున్నప్పుడే
బంగారం నగగా మారుతుంది, సైట్ విజిట్ చేసి
ఇంటికి చేరగానే ఒక్కరోజు గడవగానే
కస్టమర్ల మనసులు మారిపోవచ్చు చేజారిపోవచ్చు
అందుకే
ఇవాళ ఇష్టపడి సైట్ కు వచ్చిన
కస్టమర్లను మిస్ చేసుకుంటే
వారమంతా వల విసిరి కష్టపడి
పట్టిన చేపల్నినీళ్ళలోకి వదిలివేసి,
తిరిగి మళ్లీ చేపల వేటకు వెళ్ళినట్లవుతుంది
పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది



