అందుకునీవు సైట్ లోయాక్టివ్ గా వుండాలి
డీసెంట్ గా వుండాలి డిగ్నిఫైడ్ గా వుండాలి
హుషారుగా వుండాలి చలాకీగా వుండాలి
నవ్వుతూ తిరుగుతు వుండాలి
శుభ్రంగా వుండాలి నీకు నాలెడ్జ్ వుండాలి
కన్విన్సింగ్ కెపాసిటే వుండాలి అప్పుడే
నీవు లీడ్ ను ఈజీగా క్లోజ్ చేయగలవు
నేడు మన కళ్ళముందు కూర్చున్న కస్టమర్ వేరు
రేపు కాల్ చేస్తే మాట్లాడే కస్టమర్ వేరు
మనతో మాట్లాడవచ్చు మాట్లాడకవచ్చు
మౌనంగా వుండవచ్చు కాల్ చేస్తే కట్ చేయవచ్చు
అంటే వేడివేడిగా వున్నప్పుడే
బంగారం నగగా మారుతుంది
ఇంటికి చేరగానే ఒక్కరోజు గడవగానే
కస్టమర్ల మనసులు మారిపోవచ్చు చేజారిపోవచ్చు
అందుకే
ఇవాళ ఇష్టపడి సైట్ కు వచ్చిన
కస్టమర్లను మిస్ చేసుకుంటే
వారమంతా వల విసిరి కష్టపడి
పట్టిన చేపల్నినీళ్ళలోకి వదిలివేసి,
తిరిగి మళ్లీ చేపల వేటకు వెళ్ళినట్లవుతుంది
పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది



