Facebook Twitter
లీడ్ క్లోజింగ్ ఎలా ? ఇదిగో ఇలా!!

మార్కెటింగ్ మేనేజర్.శతాబ్దిటౌన్ షిప్స్

కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని
ఏ కస్టమర్ ను బ్రతిమిలాడరాదు
బ్రతిమిలాడి లాభం లేదు కూడా
అంతగా దిగజారి పోరాదు కూడా

దాహం వేసిన గుర్రం నీళ్ళు త్రాగినట్లు
అవసరం వున్నవాడు అప్పుచేస్తాడు
ఆకలి వేసినవాడు అన్నం తింటాడు
ఇంట్రెస్ట్ వున్నవాడు ఇన్వెస్ట్ చేస్తాడు

కొందరు చేతులు పట్టుకున్నా
నడుం పట్టుకున్నా మెడ పట్టుకున్నా
జుట్టు పట్టుకున్నా విడిపించుకుంటారు

అందుకే పీకపట్టుకొని గట్టిగా నొక్కినప్పుడే
కస్టమర్లు ఊపిరాడక చెక్కుల్ని కక్కేస్తారు

ఐతే బలవంతం చేయకూడదు
కాని రెండు ఆప్షన్స్ ఇచ్చి
కస్టమర్లను కన్ఫ్యూజ్ చెయ్యాలి
జుట్టు పీక్కునేలా చెయ్యాలి
సందిగ్ధంలో దగ్ధమైపోయేలా చెయ్యాలి

భయపెట్టకుండా బాధపెట్టకుండా
ఒక బిగ్ సిటీనీ దర్శించేలా
ఖరీదైన కమ్మని కలలు కనేలా
భారీలాభాలను ఊహించుకునేలా చెయ్యాలి
కస్టమర్లకు అరచేతిలో స్వర్గాన్ని
ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్ని చూపెట్టాలి

ఆలస్యమంటూ చేయకుండా
అవకాశాన్ని చేజార్చుకోకుండా
రేపటికంటూ వాయిదా వేయకుండా
అప్పుడే అక్కడే సైట్ లోనే
99% లీడ్ ను క్లోజ్ చెయ్యాలి