Facebook Twitter
Let us all say Thanks to God

చెత్తకుండీలోఎంగిలి మెతుకులు ఏరుకునే బిక్షగాన్నీ కిటికీలో నుండి చూసిన *ఒక ధనవంతుడు
Thanks God నేను బిక్షగాన్ని కాదు
అనుకున్నాట్ట

నగ్నంగా మతిస్తిమితం లేకుండా నడివీధిలో తిరిగే పిచ్చివాన్ని చూసిన ఒక బిక్షగాడు
Thanks God నేను పిచ్చివాన్ని కాదు అనుకున్నాట్ట

ఆపరేషన్ అవసరమై ఆసుపత్రికి వెళ్ళే రోగిని
చూసిన కాస్త ఇంగ్లీష్ వచ్చిన ఒక పిచ్చివాడు
Thanks God I am not a patient అనుకున్నాట్ట

హాస్పిటల్లో మరణించి మార్చురీకి వెళ్ళే శవాన్ని చూసిన ఒక రోగి
Thanks God నేనింకా బ్రతికే ఉన్నాను అనుకున్నాట్ట

అందుకే నిజానికి ఒక్కచనిపోయినవాడు మాత్రమే భగవంతునికి Thanks చెప్పలేడు

మరి అన్ని అవయవాలనిచ్చి, మంచి ఆరోగ్యాన్నిచ్చి  ఏ రోగాలురాని, ఏ కష్టాలులేని ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించిన ఆ భగవంతునికి బ్రతికివున్న
మీరెందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు  చెప్పలేకపోతున్నారు, ఒక్కసారి ఆలోచించండి.