Facebook Twitter
చెట్టు సందేశం…

నీ కడుపు నింపే కూడును నేనే..
నీకు నీడ నిచ్చే గూడును నేనే..

నువ్వు కట్టే బట్టను నేనే..
నీ చేతి కర్రను నేనే

నీ ఆయువును నేనే
నీ ప్రాణవాయువును నేనే..

నీ కాడెను నేనే.. నీ పాడెను నేనే..
నిన్ను కాల్చే కట్టెను నేనే..

నీ తరువును నేనే 
నీ బతుకు తెరువును నేనే.

అందుకే కనులు తెరిచి కాంచుమురా..
ఒక్క మొక్కనైనా పెంచుమురా’...

అని చెట్టు అందరిని అర్థిస్తుందని నా ఉద్దేశం