O My God ! Right Messages Sent to Wrong Persons
ఆనాడు చెట్టు కింద కూర్చుంటే
బుద్ధుడికి జ్ఞానోదయమైందో లేదో గాని
మిత్రమా ఈనాడు మీ పుణ్యమాని
నాకు ఒక పచ్చినిజం తెలిసింది
అడగకుండా, అమ్మ కూడా
అన్నం పెట్టదని, అందుకే ఎవరికీ
అడగకుండా ఉచిత సలహాలివ్వరాదని
ఎంతో విలువైన సమయాన్ని,
శక్తిని,వృధా చేసుకోరాదని,
ఎక్కువగా పెడితే ఎవరైనా కక్కేస్తారని,
ఇష్టంలేని వారికి అదేపనిగా
మంచి మంచి మెసేజెస్ పంపరాదని
స్పందించే గుణం లేనివారికి అస్సలు
విలువైన సందేశాలేవీ ఇవ్వరాదని.
వారం రోజుల నా శ్రమంతా
బూడిదలో పోసిన పన్నీరైందనీ
కష్టపడి పంపిన నా మేసేజస్ మొత్తం
మీరు చదవనేలేదని,చెత్తబుట్టకు చేర్చారని,
నేడే నాకు ఒక పచ్చినిజం తెలిసింది
మీ పుణ్యమాని నాకు జ్ఞానోదయమైంది
From tomorrow onwards
No Messages - No Calls.
Only Friendly Meetings &
Face to Face Discussions
Kavithalu - 3



