Facebook Twitter
ఓ బాపూజీ మీకు వందనం...

మర ఫిరంగులున్న
మారణాయుధాలున్న
సుశిక్షితులైన సైనికులున్న
ఎత్తులకు పైఎత్తులు ‌వేస్తు
"విభజించు పాలించు" అన్న
విషపూరిత విధానమున్నా
ఎవరినీ దేనినీ లెక్కచేయక
దోచుకునే దోపిడీ దొంగలకన్న
కౄరమైన పాషాణహృదయులైన
అతిశాడిస్టులైన ఆంగ్లేయులను
ఖద్దరుదుస్తులు కట్టి కర్రచేతపట్టి
ఏనుగుల గుంపును ఎదురించినట్లు
పులులతో, సింహాలతో, కొమ్ములు
తిరిగిన పొట్టేళ్ళతో పోరాడినట్లు
కొండలనే ఢీకొట్టినట్లు, బుసలుకొట్టే
కోడెనాగుల మధ్య తిరిగిన బాపూజీ

"వందేమాతరమని" నినదిస్తూ
"సహాయ నిరాకరణంటూ"
"ఉప్పుసత్యాగ్రహమంటూ "
"క్విట్ ఇండియా "అంటూ
ఊపిరాడని ఉద్యమాలతో
జాతిమొత్తాన్ని జాగృతం చేసి
దేశప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను
రగిలించిన "గొప్ప దేశభక్తుడు"
"స్వాతంత్ర్య సమరయోధుడు"

ఒక్కపిలుపుతో ప్రభంజనమై పొంగి
జైళ్ళన్నీ నిండిపోయేలా అవసరమైతే
ప్రాణత్యాగం చేసే సమరయోధులను
ఉపన్యాసాలతో ఉర్రూతలూగించి
ఉప్పొంగే సముద్ర కెరటాల్లా మార్చి
"అహింసనే ఆయుధంగా" చేసుకొని
అతికౄరులైన ఆంగ్లేయుల్ని ఎదిరించిన
వారి గుండెల్లో నిదురించిన నిప్పులు
కురిపించిన మన "జాతిపిత బాపూజీ"
ఉద్యమాలెన్నో నడిపిన "ఉద్యమకారుడు"
శాంతి చర్చలు జరిపిన "శాంతదూత"
జైలుజీవితాన్ని అనుభవించి "స్వాతంత్ర్య
సాధనే తన శ్వాసగా" దేశానికే సర్వం
త్యాగం చేసిన" ఘనుడు త్యాగధనుడు"

భారతీయులందరికీ
స్వేచ్ఛను స్వాతంత్య్రాన్ని
సమానత్వాన్ని సౌభ్రాతృత్వాన్ని
ప్రసాదించిన ఓ "ఆదర్శవాది ఓ"అమరజీవి""
ఓ బాపూజీ మీకు వందనం! అభివందనం!!