Facebook Twitter
ఉక్కు మనిషి"బాపూజీ"...

మందు మటను
మగువలను ముట్టనని
విందు వినోదాలతో
విలాసాలతో 
విదేశాల్లో విచ్చలవిడిగా
విహరించనని
మాట ఇచ్చి ఆమాటమీదే
నిలబడిన "దృఢచిత్తుడు"
భారతీయుల్లో స్వాతంత్ర్యకాంక్షను
రగిలించిన"చైతనజ్వాల"మన బాపూజీ

సతీసహగమనంవంటి
అంధవిశ్వాసాలను అరికట్టిన
మధ్యపాన, వరకట్నం వంటి
సాంఘిక దురాచారాలను
బాల్య, వితంతువు వివాహాలను
మూఢాచారాలను రూపుమాపిన
"గొప్ప సంఘసంస్కర్త" మన బాపూజీ

నల్లని త్రాచుల్లాంటి తెల్లదొరలను
ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంతో
ఊపిరాడకుండా ‌ఉక్కిరిబిక్కిరి చేసిన
ఉక్కుసంకల్పమున్న "ఉక్కు మనిషి"
నిరాడంబరుడు "నిగర్వి నిర్మలమూర్తి"
రాజకీయనేత  "శాంతిదూత"జాతిపిత
సత్యాన్వేషి"నిత్యతాత్వికుడు"
"స్వాతంత్ర్య సమరయోధుడు"మనబాపూజీ

1000 ఏళ్ళైనా చెక్కుచెదరని
పటిష్టమైన పునాదుల మీద
భారతజాతి నిర్మాణం జరగాలని
కలలుగన్న ఒక"మార్గదర్శి ఒక దీర్ఘ దర్శి"
వారే 'ఒక ప్రేమమూర్తి ఒక త్యాగమూర్తి"
అందరికీ వారే "కొండంత స్పూర్తి"
అజరామరం బాపూజీ "అఖండకీర్తి"
వారి స్మరణే మనకు ఒక ప్రేరణ
వారి అడుగుల్లో అడుగులు వేద్దాం
వారి ఆశయాలకు జీవితాలను అంకితంచేద్దాం