ఒక "మధురగాత్రం"మూగబోయింది
ఒక "సంగీత ధృవతార" రాలిపోయింది
ఎన్నో ఔత్సాహిక మొక్కలకు
నీడ నిచ్చిన ఒక "మహావృక్షం" నేలకొరిగింది
ఎందరికో వెలుగులు పంచిన
ఒక "ఆశాకిరణం" ఆరిపోయింది
అందుకే,చలన చిత్రసీమ యావత్తు
శోకసముద్రంలో మునిగిపోయింది
"రా దిగిరా దివి నుండి
భువికి దిగిరా"అంటూ
పాడుతూ గగనానికి వెళ్ళిన
"గానగంధర్వుడు" మన బాలు
"నాపాట పంచామృతమంటూ"
తన గొంతులో అమృతాన్ని
నింపుకుని పాడిన ప్రతిపాటకు
ప్రాణం పోసిన "పాటలమాంత్రికుడు" మనబాలు
పాల్గొన్న ప్రతి సంగీతసభలో
గుండెలకు మెత్తగా హత్తుకునేలా
ముసిముసి నవ్వులు రువ్వుతూ
ఎన్నో జీవిత సత్య సందేశాలను
హితవచనాలను అందించిన
కాషాయ వస్త్రాలు ధరించని
"ఓ ఆథ్యాత్మిక గురువు"మన బాలు
16 భాషల్లో 40 వేల పాటలు
పాడినా అలసి పోలేదు,కానీ,
కరుణ జాలిలేని ఆ కరోనారక్కసితో
పోరాడి పోరాడి"ఓడిపోయాడు"మన బాలు
ఒక్కరోజే 21పాటలు పాడిన
6 పర్యాయాలు జాతీయ
పురస్కారాలందుకున్న
ఆ "పద్మభూషణుడికి"
ఆ"సంగీత సామ్రాట్"కు"స్వర్గంలో
స్వరాభిషేకం"స్వాగతం పలికింది
అందుకే మన బాలు బిజీ షెడ్యూల్
హఠాత్తుగా మారిపోయింది...
ఆ అమరగాయకుని
ఆత్మశాంతికి...........
అశ్రునయనాలతో....
ఇదే "నా అక్షరనివాళి".........



