మనది కానిది మనకు
*దక్కాలనుకోవడం* ధర్మమా ?
మనకు దూరమైనది మనకు
*చిక్కాలనుకోవడం* న్యాయమా?
అర్హత లేకుండా సింహాసనం
*ఎక్కాలనుకోవడం* భావ్యమా ?
కనిపించిన ప్రతి రాయిని దైవమని
*మొక్కాలను కోవడం*
ఎక్కడి భక్తి ? ఎక్కడి ధర్మం?
విడిపోండి విడిపోండి
కలిసిఉంటే కాపురం చేయలేరని
చెప్పేవారిని కాలిచెప్పుతో కొట్టండి,
కాని
కలిసి ఉండండి కలిసి ఉండండి
కలిసి ఉంటేనే కలదు సుఖమని
చెప్పేవారికాళ్లకు మ్రొక్కండి
కదలని బొమ్మకు కవితలు చెప్పడం
గుడ్డివానికి అద్దం చూపడమే
మారని మనిషికి నీతులు చెప్పడం
కుక్కతోక పట్టి గోదారి ఈదడమే
స్పందించని వ్యక్తికి సందేశాలివ్వడం
మట్టేనుగును నమ్మి నట్టేట్లో దిగడమే
సన్యాసిగా మారినోడికి సలహాలివ్వడం
సెల్లో సిమ్ లేకుండా కాల్ చేయడమే
అన్నీ ఒక్కటే వ్యర్థం వ్యర్థం వ్యర్థం
అన్న పోలన్న చెప్పేది మంచిమాటే
విన్న చాలు మన బ్రతుకు పూలబాటే
అన్న పోలన్న సుమధుర సుభాషితం
విన్న చాలు జీవితం సువర్ణ శోభితం
అన్న పోలన్న పలుకు ప్రతి ప్రేమ పలుకు
విన్న చాలు జీవితాన అమృతం చిలుకు
ప్రేమే పునాదైతే సమస్యలన్నీ సమసిపోతాయి



