Facebook Twitter
సత్యాలు...ఆణిముత్యాలు

"నేను" అనే
అహంకారాన్ని
...త్యజించు
"మనం" అంటూ
తోటివారిని
సాటివారిని
నీ సహోదరులుగా
...భావించు
నిజం నిప్పులాంటిదని
...గ్రహించు
దహించి వేస్తుందన్న
సత్యాన్ని...గుర్తించు
నీతిగా నిజాయితీగా
నిస్వార్థంగా...జీవించు

బాధలను...భరించు
దిగులును...దిగమింగు
పదిమందిని...ప్రేమించు
నవ్వు నలుగురిని...నవ్వించు

ఈ రంగులప్రపంచంలో
విహంగమై స్వేచ్ఛగా...విహరించు
కర్త కర్మ క్రియయైన
పైవాడు దివినుండి నిన్ను...దీవించు...

ప్రతినిత్యం..భక్తితో...ఏకాగ్రతతో
పగలురాత్రి...పరమాత్మను...ప్రార్థించు
అర్థించు ...ధ్యానించు సదా...స్మరించు...
ఇవే నిజజీవిత...నిత్యసత్యాలు
మన అనుభవాల‌...ఆణిముత్యాలు