ఒక తండ్రిని ఓడించిన తర్వాత
తనయున్ని ఓడించడం అంత కష్టమేమీ కాదు
ఒక నాయకున్ని ఎదిరించిన తర్వాత
కార్యకర్తను బెదిరించడం అంత కష్టమేమి కాదు
ఒక పండితుని మోసం చేసిన తర్వాత
పామరున్ని నమ్మించడం చాలా తేలిక
ఒక వీరుడి కొమ్ములు విరిచిన తర్వాత
పిరికివాడి భరతం పట్టడం
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించడమే
అన్న పోలన్న సుభాషితం
విన్న మీకు శుభోదయం
ఎన్నో పెళ్లిచూపులు
చూసిన తర్వాతనే
మనకు నచ్చిన
మనం మెచ్చిన
సంబంధం దొరికేది
మనకు పెళ్లి కుదిరేది
ఎన్నో వెంచర్స్
వెదికిన తర్వాతనే
ఎంతో విలువైన సమయాన్ని
వెచ్చించిన తర్వాతనే
ఎంతో ఓపికతో తిరిగి
చూసిన తర్వాతనే
మనకు నచ్చిన ప్లాటు దొరికేది
ఇష్టపడి మనం కొనేది
ఎన్నో షాపింగ్ మాల్స్
కాళ్ళు అరిగేలా
తిరిగిన తరువాతనే
మనకు నచ్చిన డ్రెస్ దొరికేది
ఒక కొత్త డ్రెస్ మనం కొనేది
అన్న పోలన్న సుభాషితం
విన్న మీకు శుభోదయం
అతిగా ఆలోచించేవారు
ప్రతిదీ భూతద్దంలోచూస్తారు
ప్రతిదీ భూతద్దంలోచూసేవారికే
గండు చీమసైతం
గర్జించే సింహంలా
తాడు సైతం
త్రాచుపాములా కనిపిస్తుంది
అతిగా ఆలోచించేవారు
అందరిని అన్నిటిని అనుమానిస్తారు
అందరిని అన్నిటిని అనుమానించేవారే
అడుగు ముందుకెయ్యలేరు
అడుగు ముందుకెయ్యలేనివారే
అభివృద్ధి చెందలేరు
అన్న పోలన్న సుభాషితం
విన్న మీకు శుభోదయం
అదృష్టం ఒక్కసారి
మనల్ని గట్టిగా తన్నితే చాలు
గారెల బుట్టలో పడడం ఖాయం
నేటి లక్షాధికారి
రేపు కోటీశ్వరుడై
పోవడం ఖాయం
ఇందులో
ఏ మాయా లేదు
ఏ మంత్రం లేదు
ఏ మ్యాజిక్ లేదు
ఒక చిన్న లాజిక్ తప్ప
కొంచెం ధైర్యంతో
కొంచెం నమ్మకంతో
కొంచెం తెలివితో
కొంచెం పెట్టుబడి పెట్టడం తప్ప
కాని,
ఆదాయం - ఆరోగ్యం - ఆయుష్షు
ఈ మూడు మాత్రం
ఆ పరమాత్మ ప్రసాధించే వరాలే
ఎవరికైనా ఎంతటి వారికైనా
అన్న పోలన్న సుభాషితం
విన్న మీకు శుభోదయం
మనిషి బాగుపడాలంటే
పెద్దలపట్ల
భయమైనా ఉండాలి
భగవంతుని పట్ల
భక్తి ఐనా ఉండాలి
లేదా మంచి విషయాలపైన
ఆసక్తి ఐనా ఉండాలి
భయం గాని
భక్తి కాని ఆసక్తి కానీ లేని వ్యక్తి
తెగిన గాలిపటంలా
ఎప్పుడు పడిపోతాడో
ఎక్కడ ఇరుక్కుపోతాడో
ఎలా పతనమౌతాడో
ఎవరికి తెలియదు
అన్న పోలన్న సుభాషితం
విన్న మీకు శుభోదయం



