Facebook Twitter
సంఘసంస్కర్త" మన బాపూజీ

నిమ్నజాతుల ఉద్దరణకై
హరిజన్ పత్రికను స్థాపించి
వర్ణవ్యవస్థను సమర్థిస్తూనే
అంబేద్కర్ కు పోటీగా
అంటరానితనాన్ని
మంటగలిపిన "మహనీయుడు"

సతీసహగమనంవంటి
అంధవిశ్వాసాలను అరికట్టిన,
మధ్యపాన, వరకట్నం వంటి
సాంఘిక దురాచారాలను సమాధి చేసిన
బాల్య, వితంతువు వివాహాలను
మూఢాచారాలను రూపుమాపిన
"గొప్ప సంఘసంస్కర్త" మన బాపూజీ

1000ఏళ్ళైనా చెక్కుచెదరని
పటిష్టమైన పునాదుల మీద
భారతజాతి నిర్మాణం జరగాలని
ఆశించిన గొప్ప"మార్గదర్శి దీర్ఘ దర్శి"
సదా చిరస్మరణీయుడు "త్యాగమూర్తి"
సువర్ణాక్షరాలతో
లిఖితమైపోయిందాయన "అఖండకీర్తి"
వారి అడుగుజాడల్లో
నడవడమే మనందరి ప్రథమకర్తవ్యం

అందుకే నేడు
ఎందరో అమరవీరుల
త్యాగఫలమైన
ఈ స్వాతంత్ర్యాన్ని స్వేచ్చను
శతృవుల చేతిలో పెట్టమని
ప్రక్కలో బల్లాలైన 
దురాక్రమణదారులను
మట్టుపెట్టేందుకు.
విప్లవ శంఖారావం పూరిస్తామని
యుద్దవీరులమై వారికి సరిహద్దుల్లోనే
సమాధులను సిద్దం చేస్తామని
సహనం సమానత్వం సౌభ్రాతృత్వంతో
భరతజాతి ఒక్కటేనని
భారతీయులదరూ ఒక్కటేనని
సమైకతా గీతాన్ని ఆలపిస్తామని
ఆ అమరజీవి అడుగుజాడల్లోనడుస్తామని
వారి ఆశయాలకు అంకితమౌతామని
ప్రతిభారతీయుడు ప్రతిజ్ఞ చేయాలి
భగవద్గీత మీద ప్రమాణం చెయ్యాలి. జైహింద్