బాపూజీ...
ఒక్క సైగ చాలు
ఒక్కచూపు చాలు
ఒక్కమాట చాలు
ఒక్క పిలుపు చాలు
ఒక్క ఆదేశం చాలు
ఒక్క సందేశం చాలు
ఒక్క ఆజ్ఞ చాలు చాలు
కోట్లమంది భారతీయులు
శిరసావహించడానికి...
పులుల్లా గర్జించిడానికి...
ఏనుగుల్లా ఎదురు తిరగడానికి...
సింహాలై పంజా విసరడానికి...
నడుములు బిగించి పులుల్లా
ముందుకు ఉరకడానికి...
జైళ్ళలో మ్రగ్గడానికి...
లాఠీదెబ్బలు తినడానికి...
తెల్లదొరలు ఉలిక్కిపడడానికి...
నిప్పుల్లోనైనా దూకడానికి...
రాక్షసులను ఎదిరించడానికి...
రక్తం చిందించిడానికి...
ప్రాణాలు అర్పించడానికి...
దేశసేవలో తరించడానికి...
జీవితాలను అంకితం చేయడానికీ...
కులాల కుమ్ములాటలు
మతాలు మంటలు లేకుండా
భిన్న కులాల మతాల జాతుల
సంస్కృతుల సాంప్రదాయాల
సమ్మేళనమైన భరత జాతిలో
భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి
భారతమాత దాస్య సంకెళ్లు త్రెంచడానికి
అహర్నిశలు కృషి చేసిన "ఆదర్శవాది"
"అభ్యుదయవాది,సమతావాది, "మానవతావాది"
మన జాతిపిత బాపూజీ ఆయన స్మరణే ఓ ప్రేరణ
ఆయనే మనకు స్పూర్తి అజరామరం ఆయన అఖండకీర్తి



