ఆస్తి - నిద్ర నాస్తి...
గుడిసెలో ఉంటేనేమి
గుడ్డిదీపం వెలుగులో
గురకలుపెట్టి ప్రశాంతంగా
నిద్రపోవు నిశ్చింతగా
నిశిరాత్రి వేళ ఓ "నిరుపేద"
ఇంటిని కాపలా కాసే
కుక్కసైతం కంటినిండా
కునుకు తీస్తుంది కాసేపు
కాని ఏడంతస్తుల
ఇంద్రభవనంలో అన్నీ
కళ్ళముందే ఊరిస్తున్నా
అన్నీ తినాలనిపిస్తున్నా
ఏ ఒక్కటీ తినలేక
ఆకలికి అలమటిస్తున్నాడు
తన బాధను ఎవరితోనూ
చెప్పుకోలేక ఏమీ చెయ్యలేక
సుఖనిద్రను, మంచి ఆరోగ్యాన్ని
ప్రశాంతమైన జీవితాన్ని
కోట్లున్నా సరే కొనలేక
కంటిమీద కునుకురాక
కుమిలిపోతున్నాడు
పాపం ఓ "అపరకుబేరుడు"
ఒక్కటే కారణం...
ఒకటే భయం అక్రమంగా ఆర్జించి
పరుపు కింద దాచుకున్న ఆ ధనాన్ని
ఏ"గజదొంగొచ్చి" దోచుకుంటాడోనని...
ఒకటే "బెంగ" పరులెవరైనా తాను
కష్టపడి ఆర్జించిన ఆస్తినెక్కడ కాజేస్తారో



