Facebook Twitter
వెతికేవెందుకు....?

వెతికేవెందుకు ?
వెయ్యిమార్గాల్లో.......
నీ ఆనందం కొరకు
అది...
నీ ఆత్మతృప్తిలోనే‌ వుండగా

వెతికేవెందుకు ?
అవని అంతా
ఆకాశంమంతా
అంతులేని సంతోషం కోసం
అది...
నీ చుట్టూవున్న
వారి ముఖాల్లోనే
వారి చిరునవ్వుల్లోనే
వారికి నీవు పంచే అందించే
ఆనందంలోనే ఉండగా...

వెతికేవెందుకు ?
వెయ్యిదారుల్లో.......
నీ ఆయుష్ పెరగాలని
అది...
నీ సేవలు పొందినవారి
దీవెనల్లోనే వుండగా...

ఎక్కడో వెతికేవెందుకు?
ముక్కోటి దేవుళ్ళకు
మ్రొక్కేవెందుకు ?
దైవసాక్షాత్కారం కోసం
సాక్షాత్తు ఆదైమే..
ఆత్మ రూపాన
నీ అంతరంగాన దాగివుండగా...